భారతదేశం, ఫిబ్రవరి 7 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 7) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. నగలు తాకట్టు పెట్టి దీపకు సాయం చేసిందా అనే అనుమానంతో తల్లి సుమిత్ర రూమ్‍లో జ్యోత్స్న చెక్ చేస్తుంది. తాను సాయం చేయలేదని చెప్పిన సుమిత్ర.. తనపై జోత్స్నకు ఎందుకు అనుమానం వచ్చిందని అనుకుంటుంది. సాయం చేయాల్సిన నేను చేయలేకపోయానని, దీప ఎదురుపడితే ముఖం ఎలా చూపించాలని అంటుంది. ఇంతలో శౌర్యకు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు చేయిస్తున్న హోమానికి ఆహ్వానించేందుకు శివన్నారాయణ ఇంటికి వస్తుంది దీప. గుమ్మ వద్దే నిల్చొని 'తాతగారు' అని పిలుస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎందుకు ఊడిపడిందని జ్యోత్స్న అనుకుంటుంది. లోపలికి రావొచ్చా అన దీప అడుగుతుంది.

దీప లోపలికి వస్తానంటే.. అక్కడే ఆగాలని శివన్నారాయణ అంటాడు. రెండు విషయాలు అడగాలని, వాటికి సమాధానం చెప్పి లోపలికి వస్తే అభ్యంతరం లేదంటాడు. చంటి దాని...