భారతదేశం, ఫిబ్రవరి 5 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 5) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఎవరు కట్టారని కార్తీక్ ఆలోచిస్తుంటాడు. కాశీని అడుగుతాడు. నువ్వు కూడా కట్టకపోతే.. ఎవరి కట్టి ఉంటారని అంటాడు. వారిద్దరూ మాట్లాడుకుంటున్నా.. కావేరి డబ్బులు కట్టిందనే విషయాన్ని దీప చెప్పదు. మామయ్య శ్రీధర్ కట్టాడేమోనని కాశీ అంటాడు. "మా నాన్న.. అంత సీక్రెట్‍గా సాయం చేసే మనిషి కాదాయన. దానం చేసినా.. సాయం చేసినా.. తన చుట్టూ పది మందికి తెలియాలి. ఆయన ఆయనరాడు. ఆయన సాయం కూడా నా కూతురికి అవసరం లేదు" అని కార్తీక్ అంటాడు.

తన తండ్రి శ్రీధర్ సాయం చేయడని నానామాటలు అంటాడు కార్తీక్. తండ్రి విషయంలోనే ఇలా ఉన్నారంటే.. మనకు సాయం చేసింది మీ విన్ని అని తెలిస్తే అసలు ఒప్పుకోరు అని మనసులో అనుకుంటుంది దీప. అక్కా నీకేమైనా తెలుసా అని దీపను కాశీ అడుగుతాడు. ఇంతలో తన...