భారతదేశం, ఫిబ్రవరి 3 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 3) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఇవ్వాలంటే.. కార్తీక్ బావను వదిలేయాలని దీపకు చెప్పినట్టు పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. దీప మంగళసూత్రానికి ఖరీదు కట్టానని చెబుతుంది. దీప నుంచి కాల్ కోసం ఎదురుచూస్తుంటుంది. బావను నాకు ఇచ్చేస్తున్నట్టు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలని దీపతో చెప్పానని పారిజాతానికి అసలు విషయం చెబుతుంది జ్యోత్స్న. దీప అగ్రిమెంట్ చించేసిందని, కార్తీక్ తనను తిట్టాడని అంటుంది. కాల్ చేసేందుకు దీపకు 24 గంటల టైమ్ ఇచ్చానని చెబుతుంది. ఇంత వరకు దీప కాల్ చేయలేదంటే నీ ఆఫర్ వద్దనే కదా అని పారిజాతం అంటుంది.

ఈ సమయంలో జ్యోత్స్న తప్ప వారిని ఏ దేవుడు కాపాడలేడని జ్యోత్స్న అంటుంది. "ఈ విషయం మన ఇంట్లో తెలిస్తే.. పసిదాని ప్రాణంతో చెలగాటం ఆడినందుకు నిన్ను ఉతికి ఆరేస్తారే" అని పార...