భారతదేశం, ఫిబ్రవరి 13 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 13) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు సాయం చేసిన సవతి కావేరికి కాంచన కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. తాను చేసిన పాపం ముందు చేసిన సాయం చిన్నదక్కా అంటూ కావేరి కూడా ప్రేమ కురిపిస్తుంది. నాది ఒక్కటే కోరిక అని.. నువ్వు అక్కా అని పిలిచే పిలుపు మాత్రం ఎప్పుడూ దూరం చేయవద్దని కావేరి అడుగుతుంది.

పసి ప్రాణాన్ని నా అహంకారం మీద దెబ్బకొట్టావ్.. నీ మంచితనాన్ని తెలియజేసి నాకు తోబుట్టువు అయ్యావ్ అని కావేరితో కాంచన అంటుంది. ఈ ఒక్క మాట చాలక్కా అని కావేరి అంటుంది. తన ఇద్దరు భార్యల మధ్య ఆప్యాయతను చూసి శ్రీధర్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. చెడగొట్టాలని చూస్తాడు. డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు కాంచన, దీపకు కార్తీక్ పంపాడని అంటాడు. మనుషులను అర్థం చేసుకోడం చేతకాదా మీకు అని దీప ఆగ్రహిస్తుంది.

శ్రీధర్ మ...