భారతదేశం, ఫిబ్రవరి 12 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 12) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు కావేరి డబ్బు ఇచ్చిందనే విషయాన్ని దాచడంపై దీపను కార్తీక్ నిలదీస్తాడు. ఈ వారం రోజుల్లో ఈ విషయం గురించి వందసార్లు మాట్లాడుకున్నా.. నిజం చెప్పలేదని దీపతో అంటాడు. మోసం చేశావన్నట్టుగా మాట్లాడతాడు. చెప్పొద్దని కావేరి మాట తీసుకుందని కన్నీళ్లతో చెబుతుంది దీప. మోసం చేశానని అనుకుంటున్నారా అని అడుగుతుంది. "నిజం చెప్పకపోవడాన్ని ఏమంటారు దీప.. నాన్న మోసం అన్నాడు. నేను దానికి ఏ పేరు పెట్టాలి" అని కార్తీక్ ప్రశ్నిస్తాడు.

తండ్రి శ్రీధర్ అన్న మాటలకు తాను ఎంత బాధపడ్డానో దీపకు కార్తీక్ చెబుతాడు. "నా కూతురు ప్రాణాన్ని నాకు భిక్షగా పెట్టానని అన్నాడు.. మా ముఖాల మీద చిరునవ్వు తన దయ అన్నాడు. ఆ మాటలు వింటుంటే చెవి నరాలు పగిలి నెత్తురు బయటికి వస్తుందేమో అనిపించింద...