భారతదేశం, ఏప్రిల్ 12 -- కార్తీక దీపం 2 ప్ర‌స్తుతం స్టార్ మాలో నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది.ఫ‌స్ట్ ఎపిసోడ్ నుంచే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ వ‌చ్చిన ఈ సీక్వెల్ సీరియ‌ల్ చాలా కాలం పాటు టీఆర్‌పీ రేటింగ్‌లో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో కొన‌సాగుతూ వ‌స్తోంది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో సీరియ‌ల్ స‌డెన్‌గా రెండో స్థానంలోకి ప‌డిపోయింది. కార్తీక దీపం 2 సీరియ‌ల్‌ను దాటేసిన గుండె నిండా గుడి గంట‌లు టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది.

ఇటీవ‌ల ప్ర‌క‌టించిన తాజా టీఆర్‌పీ రేటింగ్‌లో గుండె నిండా గుడి గంట‌లు 11.76 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకోగా...కార్తీక దీపం 2 సీరియ‌ల్ 11.68 టీఆర్‌పీతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.

తెలుగులో విజ‌య‌వంత‌మైన కార్తీక దీపం సీరియ‌ల్‌కు సీక్వెల్‌గా కార్తీక దీపం 2 తెర‌కెక్కుతోంది. కార్తీక దీపం 2 సీరియ‌ల్‌లో నిరు...