భారతదేశం, ఫిబ్రవరి 4 -- శౌర్య ఆప‌రేష‌న్‌కు క‌ట్టింది ఎవ‌రో తెలుసుకోవాల‌ని కార్తీక్‌, దీప అనుకుంటారు. కార్తీక్ పేరుతోనే డ‌బ్బు క‌ట్టార‌ని న‌ర్స్ చెబుతుంది. నా పేరు మీద ఎవ‌రు డ‌బ్బులు చెల్లించి ఉంటారు, మ‌న‌వాళ్లు ఎవ‌రైనా హాస్పిట‌ల్‌కు వ‌చ్చారా అని దీప‌ను అడుగుతాడు కార్తీక్‌. కావేరి వ‌చ్చి త‌న‌తో మాట్లాడిన మాట‌ల్ని దీప గుర్తుచేసుకుంటుంది. తాను వ‌చ్చిన‌ట్లు కార్తీక్‌కు చెప్పొద్దు అని ఆమె మాట‌లు జ్ఞాప‌క‌మ‌స్తాయి.

ఎవ‌రు రాలేద‌ని దీప అబ‌ద్ధం ఆడుతుంది. అడ‌క్కుండా మ‌న‌కు డ‌బ్బులు ఇచ్చిన ఆ దేవుడు ఎవ‌రు అని కార్తీక్ అనుకుంటాడు. అంత విచిత్రంగా ఉంద‌ని, మ‌న‌కు తెలియ‌కుండా, మ‌నం అడక్కుండా డ‌బ్బులు క‌ట్ట‌డం ఏంటో, ఆగిపోతుంద‌నుకున్న ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌డం ఏంటో అని కార్తీక్ అనుకుంటాడు. డ‌బ్బులు క‌ట్టింది ఎవ‌రో త‌న‌కు తెలుసున‌ని దీప మ‌న‌సులో అనుకుంటుంది.

కావేర...