భారతదేశం, ఏప్రిల్ 10 -- గౌత‌మ్‌తో జ్యోత్స్న పెళ్లిని ఆపేయ‌మ‌ని తండ్రిని వేడుకుంటుంది కాంచ‌న‌. కాళ్లు ప‌ట్టుకుంటాన‌ని బ‌తిమిలాడుతుంది. జ్యోత్స్న పెళ్లి ఆగ‌ద‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. ముహూర్తాలు పెట్టుకుంటున్నామ‌ని, ఫారిన్‌లో గౌత‌మ్‌, జ్యోత్స్న‌ల పెళ్లి చేయ‌బోతున్న‌ట్లు చెబుతాడు. మీరు ఎక్క‌డ ఆపేస్తారోన‌ని భ‌య‌ప‌డి పారిపోతున్నామ‌ని అంటాడు. నేనే నీ కాళ్లు ప‌ట్టుకుంటాన‌ని కాంచ‌న కాళ్ల‌కు మొక్కుతాడు శివ‌న్నారాయ‌ణ‌.

ఈ ఇంట్లో శుభ‌కార్యం అనే మాట వింటే మీకు న‌చ్చ‌డం లేదు...మీ కొడుకు కాపురం బాగానే ఉంది క‌దా..మ‌రి నీ అన్న కూతురు ఏం పాపం చేసింది...ఆమెను ఎందుకు అలా వేధిస్తున్నార‌ని కాంచ‌న‌పై ఫైర్ అవుతాడు శివ‌న్నారాయ‌ణ‌. కాంచ‌న క‌న్నీళ్లు చూసి...ఇది పెళ్లి జ‌రుగుతున్న ఇళ్లా...చావు ఇళ్లా...ఎందుకు ఆ ఏడుపు అని శివ‌న్నారాయ‌ణ క‌సురుకుంటాడు. ఏ జ‌న్మ‌లో చేసిన ...