భారతదేశం, ఏప్రిల్ 4 -- దీప‌ను మాట‌ల‌తో దారుణంగా అవ‌మానిస్తాడు శ్రీధ‌ర్‌. జ్యోత్స్న పెళ్లిని అబ‌ద్దాలు చెప్పి దీప‌నే చెడ‌గొట్టింద‌ని నింద‌లు వేస్తాడు. దీప‌కు మాత్రం కార్తీక్ స‌పోర్ట్ చేస్తాడు. జ‌రిగిన అవ‌మారం, ప‌డిన మాట‌లు త‌ల్చుకొని దీప బాధ‌ప‌డుతుంది. ఆమెను కార్తీక్ ఓదార్చుతాడు. ఎవ‌రికోస‌మైతే నువ్వు ఇదంతా చేస్తున్నావో...వాళ్లే అర్థం చేసుకునే ప‌రిస్థితులో లేరు. వాళ్లు బాగానే ఉన్నారు. కానీ నీ కోసం నేను...నా కోసం నువ్వు బాధ‌ప‌డుతున్నామ‌ని కార్తీక్ అంటాడు.

గౌత‌మ్‌ను మాత్రం వ‌దిలిపెట్ట‌న‌ని దీప అంటుంది. త‌ప్పించుకోవ‌డం వాడి తెలివితేట‌లు కావ‌చ్చు. కానీ నా నిజాయితీని నిరూపించ‌డానికి ఒక రోజంటూ వ‌స్తుంది. ఆ రోజు నిజాన్ని బ‌య‌ట‌ప‌డ‌కుండా ఎవ‌రూ ఆప‌లేర‌ని దీప అంటుంది. పెళ్లి ఆగిపోయింది క‌దా..ఇక వాడి సంగ‌తి వ‌దిలేయ‌మ‌ని దీప‌తో అంటాడు కార్తీక్‌. ర‌మ్య...