భారతదేశం, ఏప్రిల్ 11 -- త‌న ఎంగేజ్‌మెంట్‌ను ప్లాన్ చేసి చెడ‌గొట్టుకున్న జ్యోత్స్న‌...ఆ నింద‌ను దీప‌పై కావాల‌నే వేసింద‌నే నిజాన్ని కార్తీక్‌తో చెబుతుంది కాంచ‌న‌. ఈ నిజం త‌న ద‌గ్గ‌ర దాచినందుకు దీప‌తో పాటు త‌ల్లిపై కార్తీక్ ఫైర్ అవుతాడు.మీరు చెప్పింది శివ‌న్నారాయ‌ణ అస‌లు న‌మ్మ‌డ‌ని, సాక్ష్యాలు తీసుకొచ్చినా ఎంత‌కు కొన్నావ‌ని అడిగే మ‌నిషి అత‌డు అని కార్తీక్ అంటాడు.

దీప ఇంట్లో క‌న‌బ‌డ‌క‌పోతే నాకు ఫోన్ చేసి చెప్పాలిగా అని త‌ల్లితో పాటు అన‌సూయ‌పై కోప్ప‌డుతాడు కార్తీక్‌. క‌నీసం దీప ఇప్పుడైనా ఎక్క‌డికి వెళ్లిందో తెలుసా అని కార్తీక్ నిల‌దీస్తాడు. గుడికి వెళ్లి ఉంటుంద‌ని అన‌సూయ స‌మాధానం ఇస్తుంది. ఆమె ఆన్స‌ర్ విన‌గానే కార్తీక్ కోపం మ‌రింత పెరుగుతుంది.

జ్యోత్స్న ఇన్ని చెత్త ప‌నులు చేసింది అని తెలిసిన త‌ర్వాత గుడికి వెళ్లి ప్ర‌శాంతంగా కూర్చొని ఉంటుంద‌...