భారతదేశం, జనవరి 30 -- శౌర్య అనారోగ్యం గురించి త‌న‌కు జ్యోత్స్న చెప్పింద‌ని కార్తీక్‌తో దీప అంటుంది.జ్యోత్స్న మంచిప‌నే చేసింద‌ని, లేదంటే ఇప్ప‌టికి నేను అబ‌ద్ధంలోనే బ‌తికేదానిన‌ని ఆవేద‌న‌కు లోన‌వుతుంది. నిజం దాచింది నీ మీద ప్రేమ‌తోనేన‌ని, కోపంతో కాద‌ని దీప‌తో కార్తీక్ చెబుతాడు. త‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని తెలిస్తే శౌర్య కూడా త‌ట్టుకోలేద‌ని, త‌న‌కు ఈ విష‌యం తెలియ‌కుండా చాలా జాగ్ర‌త్త‌ప‌డ్డాన‌ని కార్తీక్ జ‌రిగింది వివ‌రిస్తాడు.

అంతేకానీ మిమ్మ‌ల్ని మోసం చేయ‌లేద‌ని చెబుతాడు. శౌర్య‌కు ఎద‌న్నా అయితే నువ్వు బ‌త‌క‌వ‌ని నిజం దాచాల్సివ‌చ్చింద‌ని అంటాడు. నిన్ను, శౌర్య‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని దీప‌తో కార్తీక్ అంటాడు. ఆప‌రేష‌న్‌కు డ‌బ్బులు కావాలి క‌దా అని దీప అంటుంది. వ‌స్తాయ‌ని కార్తీక్ భార్య‌ను ఓదార్చుతాడు.

దీప‌, శౌర్య గురించి ఆలో...