భారతదేశం, ఏప్రిల్ 12 -- త‌న‌పై జ్యోత్స్న వేసిన నింద‌ల‌ను ఆధారాల‌తో నిరూపించాల‌ని దీప అనుకుంటుంది. కానీ జ్యోత్స్న తెలివిగా వేసిన ప్లాన్ కార‌ణంగా అడ్డంగా బుక్క‌వుతుంది. దీప‌ను గ‌న్‌తో బెదిరిస్తుంది జ్యోత్స్న‌. ఆమె చేతుల‌లో నుంచి గ‌న్ లాక్కున్న దీప‌...జ్యోత్స్న‌కు గురిపెడుతుంది. కానీ పొర‌పాటున గ‌న్ పేలి బుల్లెట్ ద‌శ‌ర‌థ్‌కు తాకుతుంది. ద‌శ‌ర‌థ్ కుప్ప‌కూలిపోతాడు.

అప్పుడే అక్క‌డికి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆ సీన్ చూసి షాక‌వుతాడు. దీప మా బావ‌ను షూట్ చేసింద‌ని కార్తీక్‌తో జ్యోత్స్న అంటుంది. ద‌శ‌ర‌థ్‌ను మావ‌య్య అని పిలుస్తాడు కార్తీక్‌. ఎవ‌ర్రా నీకు మావ‌య్య అని కార్తీక్‌ను నెట్టేస్తాడు శివ‌న్నారాయ‌ణ‌. చావును నా ఇంటికి పంపించావుగా...నువ్వు నా కొడుకును ముట్టుకోవ‌ద్ద‌ని అంటాడు.

ద‌శ‌ర‌థ్‌ను బ‌తికించుకున్న త‌ర్వాత మీ అంతుతేలుస్తాన‌ని, ఎవ‌రిని వ‌దిలిపెట...