భారతదేశం, మార్చి 13 -- జ్యోత్స్న పెళ్లి చేసుకోవాల‌నుకున్న గౌత‌మ్ ఓ మోస‌గాడు అనే నిజం దీప‌కు తెలుస్తుంది. ఓ అమ్మాయిని మోస‌గించిన అత‌డిని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంటుంది. గౌత‌మ్‌పై పోలీసు కేసు పెట్టాల‌ని అనుకుంటుంది. కానీ ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే తాము బ‌త‌క‌లేమ‌ని, ప‌రువు పోతుంద‌ని ఆ అమ్మాయి త‌ల్లిదండ్రులు దీప‌ను బ‌తిమిలాడుతారు. అక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని దీప కాళ్లుప‌ట్టుకోబోతారు.

నువ్వు త‌ప్పించుకోలేవు...చేశానికి పాపానికి శిక్ష అనుభ‌వించాల్సిందేన‌ని గౌత‌మ్‌తో అంటుంది దీప‌. నీలాంటి వాడికి కాల‌మే గుణ‌పాఠం చెబుతుంద‌ని, క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌ద‌ని గౌత‌మ్‌ను హెచ్చ‌రించి వెళ్లిపోతుంది దీప‌.

గౌత‌మ్ సంబంధం మ‌న‌కు అన్ని విధాలుగా స‌రిగ్గా స‌రిపోయే సంబంధం అని శివ‌న్నారాయ‌ణ అంటాడు. పైగా ఇల్ల‌రికానికి రావ‌డానికి గౌత‌మ్ కూడా ఒప్పుకునేలా ఉన్నాడ...