భారతదేశం, ఏప్రిల్ 17 -- దీప‌కు యావ‌జ్జీవ శిక్ష త‌ప్ప‌ద‌ని కార్తీక్‌తో అంటాడు శ్రీధ‌ర్‌. ద‌శ‌ర‌థ్‌ను దీప కాల్చింది అన‌డానికి బ‌ల‌మైన సాక్ష్యాలు ఉన్నాయ‌ని చెబుతాడు. మీ ద‌గ్గ‌ర మాత్రం సాక్ష్యాలు, ఆధారాల‌తో పాటు మంచి లాయ‌ర్ కూడా లేడ‌ని ఎగ‌తాళిగా మాట్లాడుతాడు. శ్రీధ‌ర్ మాట‌ల‌తో కాంచ‌న ఎమోష‌న‌ల్ అవుతుంది.

ఇంకా దీప జైలు నుంచి బ‌ట‌య‌కు రావ‌డం క‌ష్ట‌మ‌ని శ్రీధ‌ర్‌. మీ అంద‌రూ వ‌దిలేయాల్సింది న‌న్ను కాదు దీప‌ను అని అంటాడు. త‌ప్పు చేసింది శిక్ష ప‌డుతుంద‌ని చెబుతాడు.

శౌర్య‌ను అనాథ‌శ్ర‌మంలో చేర్పిద్దాం...మ‌న‌మంతా మంచి ఇళ్లు తీసుకొని దాంట్లో ఉందాం. ఆ త‌ర్వాత నీ పెళ్లి అని కార్తీక్‌తో అంటాడు శ్రీధ‌ర్‌. అక్క‌డితో ఆగ‌క‌పోతే నీ పెళ్లి నేను చేస్తా అని తండ్రికి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్‌. ఇక్క‌డి నుంచి వెళ్ల‌క‌పోతే చీపురు క‌ట్ట విర‌గ‌క త‌ప్ప‌ద‌ని శ్రీధ‌ర్‌...