భారతదేశం, ఏప్రిల్ 3 -- Karthika Deepam 2 Serial: కార్తీక్‌ను వెతుక్కుంటూ శ్రీధ‌ర్ వ‌స్తాడు. తండ్రిని చూడ‌గానే ఈ ద‌రిద్రాన్ని మ‌నం భ‌రించ‌లేమ‌ని, ఇళ్లు ఖాళీ చేసి ఎక్క‌డికైనా దూరంగా వెళ్లిపోదామ‌ని కాంచ‌న‌తో కార్తీక్ అంటాడు. ఎందుకు అని శ్రీధ‌ర్ అడుగుతాడు. మ‌న‌శ్శాంతి కోసం అని కార్తీక్ బ‌దులిస్తాడు. మ‌న‌శ్శాంతి కావాలంటే మార్చాల్సింది ఇళ్లు కాదు ఇల్లాలిని అని శ్రీధ‌ర్ వెట‌కారంగా మాట్లాడుతాడు. తండ్రి మాట‌ల‌తో కార్తీక్ ఫైర్ అవుతాడు.

ఇంత‌కుముందు ఇదే మాట ఒక్క‌సారి అన్నావు. వ‌ద్ద‌ని ప‌ద్ద‌తిగా చెప్పా...మ‌ళ్లీ అన్నావు...ఇక్క‌డితో ఆపేసి త‌మ‌రు బ‌య‌లుదేరండి అని తండ్రికి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్‌. రంగుల మీద ప‌డ‌కుండా హోలీ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఎలా ఉంటుందో...దీప లాంటి పెళ్లాన్ని పెట్టుకొని ప‌ద్ధ‌తి గురించి మాట్లాడితే అలాగే ఉంటుందని దీప‌ను త‌క్కువ చేస...