భారతదేశం, ఫిబ్రవరి 25 -- స‌త్య‌రాజ్ రెస్టారెంట్ భాద్య‌త‌ల్ని కార్తీక్‌, దీప చేప‌డ‌తారు. మొద‌టిరోజే వారి రెస్టారెంట్‌కు జ్యోత్స్న వ‌స్తుంది. స‌రిగ్గా నెల తిరిగేస‌రికి స్టాఫ్ జీతాలు కూడా ఇవ్వ‌లేక రెస్టారెంట్‌ను వ‌దిలి పారిపోతార‌ని కార్తీక్‌, దీప‌తో అంటుంది. నువ్వు ప‌క్క‌న ఉండ‌గా కార్తీక్ గెల‌వ‌లేడ‌ని దీప‌ను త‌క్కువ చేస్తూ మాట్లాడుతుంది జ్యోత్స్న‌. కార్తీన్‌ను తాను గెలిపించి చూపిస్తాన‌ని జ్యోత్స్న‌తో ఛాలెంజ్ చేస్తుంది దీప‌.

స‌త్య‌రాజ్ రెస్టారెంట్ నుంచి వెళ్ల‌బోతూ...వ‌స్తా అని అని వెట‌కారంగా అంటుంది జ్యోత్స్న‌. మ‌ళ్లీ రావ‌ద్ద‌ని కౌంట‌ర్ వేస్తుంది దీప‌. జ్యోత్స్న‌తో దీప వాదిస్తుంటే ప‌క్క‌నే ఉన్న కార్తీక్ మౌనంగా ఉంటాడు. ఎందుకు సెలైంట్‌గా ఉన్నార‌ని అడుగుతుంది. ఇప్పుడు మాట‌ల‌తో కాదు చేత‌ల‌తో స‌మాధానం చెప్పాల‌ని బ‌దులిస్తాడు.ఈ రెస్టారెంట్‌కు ఉన్న...