భారతదేశం, మార్చి 21 -- త‌న ఎంగేజ్‌మెంట్ క్యాట‌రింగ్ ఆర్డ‌ర్‌ను కార్తీక్ రెస్టారెంట్‌కు ఇస్తుంది జ్యోత్స్న‌. ఆర్డ‌ర్ తీసుకోవ‌డానికి శివ‌న్నారాయ‌ణ ఇంటికొస్తారు కార్తీక్‌, దీప‌. ఇక్క‌డికి వ‌చ్చి త‌ప్పు చేశామ‌ని భ‌ర్త‌తో దీప అంటుంది. గొడ‌వ‌లు ఎందుక‌ని కార్తీక్‌కు స‌ర్ధిచెప్ప‌బోతుంది. మ‌నం ఎవ‌రి జోలికి వెళ్లొద్దు. మ‌న జోలికి ఎవ‌రైనా వ‌స్తే వ‌ద‌లొద్దు అని కార్తీక్ బ‌దులిస్తాడు. మ‌న‌ల‌ను జ్యోత్స్న అవ‌మానించాల‌ని చూసింది.

ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింద‌ని కార్తీక్ అంటాడు. ఎంగేజ్‌మెంట్ క్యాట‌రింగ్ ఆర్డ‌ర్ క్యాన్సిల్ అవుతుంద‌ని దీప‌తో చెబుతాడు కార్తీక్‌. క్యాన్సిల్ కాక‌పోతే అని దీప అడుగుతుంది. క్యాట‌రింగ్ చేద్దామ‌ని కార్తీక్ బ‌దులిస్తాడు. ఆర్డ‌ర్ ఓకే అంటే ఫుడ్‌తో వ‌ద్దాం...కాదంటే వాళ్లు ఇచ్చిన డ‌బ్బులు తిరిగి ఇచ్చేద్దామ‌ని కార్తీక్ అంటాడు. ఈ సారి ఈ...