భారతదేశం, ఏప్రిల్ 18 -- Karthika Deepam 2 Serial: మా నాన్న‌కు ఏదైనా జ‌రిగితే నిన్ను వ‌దిలిపెట్ట‌న‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న‌ దీప‌కు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న‌. దీప‌పై నిందలు వేస్తుంది. ఆ మాట‌ల‌ను స‌హించ‌లేని దీప...జోత్స్న‌ పీక ప‌ట్టుకుంటుంది. నీకు ఏ దురుద్దేశం లేక‌పోతే గ‌న్ ఎందుకు బ‌య‌ట‌కు తీశావ‌ని నిల‌దీస్తుంది. నొప్పితో విల‌విల‌లాడుతూ త‌న‌ను వ‌దిలేయ‌మ‌ని జ్యోత్స్న అరుస్తుంది. కార్తీక్‌తో పాటు ఎస్ఐ వ‌చ్చి జ్యోత్స్న‌ను వ‌దిలిపెట్ట‌మ‌ని దీప‌కు చెబుతారు.

న‌న్ను చంప‌బోయి మా డాడీని దీప‌నే షూట్ చేసింద‌ని జ్యోత్స్న అంటుంది. ఆమె మాట‌ల‌తో దీప కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. జ్యోత్స్న అని అరుస్తుంది. సెల్‌లో ఉన్న మ‌నిషికి వార్నింగ్ ఇవ్వాల‌ని చూస్తే ఇలాగే ఉంటుంద‌ని కార్తీక్ అంటాడు.

మీరు చేసింది త‌ప్పేన‌ని జ్యోత్స్న‌కు క్లాస్‌ ఇస్తాడు ఎస్ఐ. మీకు మీకు ...