భారతదేశం, ఫిబ్రవరి 27 -- త‌న రెస్టారెంట్ స‌క్సెస్ అయిన ఆనందాన్ని త‌ల్లితో క‌లిసి పంచుకుంటాడు కార్తీక్‌. కానీ జ్యోత్స్ప వ‌చ్చి ఆ సంతోషాన్ని చెడ‌గొడుతుంది. జ్యోత్స్న‌కు కార్తీక్ గ‌ట్టిగా క్లాస్ ఇచ్చి ఇంట్లో నుంచి పంపిస్తాడు. జ్యోత్స్న వెళ్ల‌బోతుండ‌గా దీప అపుతుంది. నీకు పెళ్లి సంబంధాలు చూడ‌టం ఆనందంగా ఉంద‌ని జ్యోత్స్న‌తో అంటుంది దీప‌.

నువ్వు పెళ్లి చేసుకోన‌న‌డం మాత్రం బాధ‌గా ఉంద‌ని అంటుంది. స‌మ‌స్య‌లో ఉన్న‌వాడు క‌నిపిస్తే ప్ర‌తి ఒక్క‌రూ ఉప‌న్యాసాలు, స‌ల‌హాలు ఇస్తూ పెద్ద‌వాళ్లైపోతార‌ని దీప స‌ల‌హాపై సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న‌.

సుమిత్ర‌మ్మ‌ను బాధ‌పెట్ట‌కుండా పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకోమ‌ని జ్యోత్స్న‌తో చెబుతుంది దీప‌. నీ భ‌ర్త‌ను నాకు ఇచ్చేయ్‌....పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటా అని జ్యోత్స్న బ‌దులిస్తుంది. ఇదే నువ్వు మార్చు...