భారతదేశం, ఏప్రిల్ 19 -- ద‌శ‌ర‌థ్ స్పృహ‌లోకి వ‌చ్చాడ‌ని న‌ర్స్ చెప్ప‌డంతో సుమిత్ర‌, శివ‌న్నారాయ‌ణ ఆనంద‌ప‌డ‌తారు. ఈ సంగ‌తి జ్యోత్స్న‌కు చెబుతుంది పారిజాతం. సుమిత్ర అని భార్య‌ను ద‌శ‌ర‌థ్ పిలుస్తాడు. ఆ పిలుపు విన‌గానే నా కొడుకుకు ఏం కాద‌ని శివ‌న్నారాయ‌ణ సంతోష‌ప‌డ‌తాడు. నువ్వు క‌ళ్లు తెరిస్తే ప్రాణం వ‌చ్చిన‌ట్లుగా ఉంద‌ని పారిజాతం అంటుంది. ఇక ద‌శ‌ర‌థ్‌కు ఏ ప్ర‌మాదం లేద‌ని డాక్ట‌ర్ చెబుతాడు..ఆయ‌న్ని ఎక్కువ‌గా మాట్లాడించ‌వ‌ద్ద‌ని చెబుతాడు.

డాడీ...నీకు ఏం కాదు...నువ్వు డిశ్చార్జ్ అయ్యే లోపు శిక్ష అనుభ‌విస్తూ దీప జైలులో ఉంటుంది...ప్రామిస్ అని తండ్రికి మాటిస్తుంది జ్యోత్స్న‌. దీప‌ను చూడ‌టానికి పోలీస్ స్టేష‌న్‌కు బ‌య‌లుదేరుతారు కాశీ, స్వ‌ప్న‌. ఎక్క‌డికి వెళుతున్నార‌ని కొడుకు, కోడ‌లిని అడుగుతాడు దాసు. నీకు చెప్పిన అర్థం కాద‌ని కాశీ అంటాడు. త‌న‌ను రోగ...