భారతదేశం, ఫిబ్రవరి 6 -- శౌర్య‌ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అవుతుంది. స్పృహ‌లోకి వ‌చ్చిన శౌర్య కార్తీక్‌, దీప‌తో మాట్లాడుతుంది. త‌న‌కు ఏమైంది అని అడుగుతుంది. నీకు ఏం కాలేద‌ని, బాగున్నావ‌ని కూతురికి స‌ర్ధిచెబుతాడు కార్తీక్‌. త‌న లాకెట్‌ను తీసి శౌర్య మెడ‌లో వేస్తాడు. ఇక నుంచి ఈ లాకెట్ ఎప్పుడు నీతోనే ఉంటుంద‌ని శౌర్య‌కు మాటిస్తాడు కార్తీక్‌. ఆ సీన్ చూసి దీప ఎమోష‌న‌ల్ అవుతుంది.

త‌ల్లి క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం చూసి ఎందుకు ఏడుస్తున్నావ‌ని శౌర్య‌ను దీప‌ అడుగుతుంది. నిన్ను ఇలా హాస్పిట‌ల్ బెడ్‌పై చూసి బాధ క‌లుగుతుంద‌ని దీప అంటుంది. త‌న‌కు ఏం కాలేద‌ని శౌర్య అంటుంది. వారం రోజులు ఇక్క‌డే ఉండాల‌ని శౌర్య‌కు చెబుతాడు డాక్ట‌ర్‌. వారం రోజులా అని శౌర్య డీలాప‌డుతుంది.

నీకు తోడుగా నేను, అమ్మ ఇక్క‌డే ఉంటామ‌ని కూతురికి కార్తీక్ స‌ర్ధిచెబుతాడు. అమ్మ‌, నాన్న ఉంటే తాను కూడ...