భారతదేశం, ఏప్రిల్ 5 -- Karthika Deepam 2 Serial: త‌న ప్రాణాలు కాపాడిన ప్రాణ‌దాత దీప అనే నిజాన్ని కార్తీక్ బ‌య‌ట‌పెడ‌తాడు. దీప ప‌ట్ల‌ త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. నువ్వు బాట‌సారివి కాదు నా భాగ‌స్వామివి అని దీప‌తో అంటాడు కార్తీక్‌. నేను నీ కోసం త్యాగాలు చేయ‌డం లేదు, నీతో జీవితాన్ని పంచుకుంటున్నాన‌ని అంటాడు. నీ కోసం నింద‌లు ప‌డ‌టం లేదు నిజాన్ని ఎదుర్కొంటున్నాన‌ని చెబుతాడు. ఇన్ని ర‌కాలు ముడిప‌డిన బంధం మ‌న‌ది అని అంటాడు.

నువ్వు నా నీడ‌లో బ‌తుకుతున్న సాధార‌ణ మ‌నిషివి కాదు. నాకు ప్రాణం పోసి బ‌తుకునిచ్చిన దేవ‌త‌వ‌ని దీప‌తో చెబుతాడు కార్తీక్‌. అప్ప‌టికీ ఇప్ప‌టికీ నేను నీకు రుణ‌ప‌డి ఉన్నాన‌ని, రుణం పెరిగింది కానీ తీర‌లేద‌ని అంటాడు. కార్తీక్ మాట‌ల‌తో దీప ఆనందం ప‌ట్ట‌లేక‌పోతుంది.

మీరు రుణం తీర్చుకున్నార‌ని కార్తీక్‌కు బ‌దులిస్తుంది...