భారతదేశం, మార్చి 28 -- జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్‌ను దీప‌నే చెడ‌గొట్టింద‌ని సుమిత్ర కూడా న‌మ్ముతుంది. గౌత‌మ్‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను నిరూపించ‌మ‌ని దీప‌తో ఛాలెంజ్ చేస్తుంది సుమిత్ర‌. గౌత‌మ్ చెడ్డ‌వాడైతే ఒక్క సాక్ష్యం చూపించ‌మ‌ని దీప‌ను కోపంగా అడుగుతుంది. గౌత‌మ్ మా కూతురు ఫ్రెండ్ కాక‌పోతే నువ్వు చెప్పిన అబ‌ద్ధం నిజ‌మ‌ని న‌మ్మేవాళ్ల‌మ‌ని సుమిత్ర అంటుంది.

జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్ చెడ‌గొడితే నాకు ఏం క‌లిసివ‌స్తుంద‌ని సుమిత్ర‌తో అంటుంది దీప‌. మొద‌టి నుంచి నా కూతురు విష‌యంలో ఎందుకు త‌ప్పుగా ఆలోచిస్తున్నావో నాకు నిజంగా అర్థం కావ‌డం లేద‌ని దీప‌పై కోపంతో అరుస్తుంది సుమిత్ర‌. త‌ప్పుగా ఆలోచించ‌డం కాదు త‌ప్పు జ‌రుగుతుంద‌ని దీప అంటుంది. జ‌గ‌డం కాదు జ‌రిగిపోయింద‌ని సుమిత్ర కోపంగా బ‌దులిస్తుంది.

ఎంగేజ్‌మెంట్ ఆగిపోవ‌డం మీ కూతురు మంచికే జ‌రిగింద‌ని అన‌సూయ అంటుంది...