భారతదేశం, మార్చి 27 -- గౌత‌మ్ మోస‌గాడు అనే నిజాన్ని అంద‌రి ముందు బ‌య‌ట‌పెడుతుంది దీప‌. అత‌డిని కొడుతుంది. దీప‌పై రివ‌ర్స్ ఎటాక్ మొద‌లుపెడ‌తాడు గౌత‌మ్‌. ఓ వంట మ‌నిషి నాపై లేని పోని నింద‌లు వేసి కొడుతుంటే సినిమా చూస్తున్న‌ట్లు చూస్తున్నార‌ని శివ‌న్నారాయ‌ణ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌పై గౌత‌మ్ ఫైర్ అవుతాడు. మీ అమ్మాయి మ‌న‌సులో మ‌రొక‌రు ఉన్నార‌ని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకోవ‌డం నా త‌ప్పు అని అంటాడు.

దీప‌కు మీకు ఏం సంబంధం లేద‌ని అన్నారు. కానీ ఈవిడ మీ మ‌న‌వ‌డి భార్య కాదా అని దీప‌ను చూపిస్తూ శివ‌న్నారాయ‌ణ‌ను అడుగుతాడు కార్తీక్‌.

శ్రీధ‌ర్‌ను చూపిస్తూ ఆయ‌న మీ ఇంటి అల్లుడు. అత‌డిని ఎందుకు దూరం పెట్టారో నాకు తెలుసు. అయినా నేను మిమ్మ‌ల్ని అడిగానా అని గౌత‌మ్ అంటాడు. ఇన్ని త‌ప్పులు మీ వైపు ఉన్నా నేను ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. కానీ నేను ఏ త‌ప్పు చేయ‌కుండానే...