భారతదేశం, మార్చి 14 -- జ్యోత్స్న కంపెనీకి చెందిన పెద్ద క్యాట‌రింగ్ కాంట్రాక్ట్‌ను కార్తీక్ సొంతం చేసుకుంటాడు. జ్యోత్స్న వ‌ల్లే కాంట్రాక్ట్ చేజారింద‌ని భావించిన శివ‌న్నారాయ‌ణ ఆమెను సీఈవో ప‌ద‌వి నుంచి తొల‌గిస్తాడు. ఈ ఓట‌మిని జ్యోత్స్న స‌హించ‌లేక‌పోతుంది. ఆ కంపెనీకి దీప‌, కార్తీక్ స‌ప్లై చేసే ఫుడ్‌లో విషం క‌లిపిస్తుంది. కార్తీక్‌, దీప ఓడిపోవ‌డం ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని అక్క‌డికి వ‌స్తుంది జ్యోత్స్న‌.

విషం క‌లిపిన భోజ‌నం తిన్న కంపెనీ ఎంప్లాయిస్ ఫుడ్ పాయిజ‌న్‌తో హాస్పిట‌ల్ పాల‌వుతార‌ని, దీప‌, కార్తీక్ పోలీస్ స్టేష‌న్‌లో ప‌డ‌తార‌ని జ్యోత్స్న అనుకుంటుంది. స‌త్య‌రాజ్ రెస్టారెంట్ క్లోజ్ అవుతుంద‌ని క‌ల‌లు కంటుంది. దీప‌ను ద‌రిద్ర‌దేవ‌త‌గా న‌మ్మించి కార్తీక్ లైఫ్ నుంచి ఆమెను దూరం చేసి...తాను బావ‌కు ద‌గ్గ‌ర కావాల‌ని అనుకుంటుంది.

ఫుడ్ తింటున్న ఓ ఎంప్ల...