భారతదేశం, జనవరి 29 -- కార్తీక దీపం 2 నేటి (జనవరి 29) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. ఆసుపత్రిలో ఉన్న శౌర్యను చూడాలంటూ ఏడుస్తూ రోడ్డుపై పరుగెడుతూ వెళుతుంది దీప. కార్తీక్ ఆమె వెనుక పరుగెడతాడు. నేను శౌర్యను చూడాలి కార్తీక్ బాబు అని అంటుంది. దీంతో ఆరోగ్య సమస్య ఉందని శౌర్యకు కూడా తెలియదు కార్తీక్ చెబుతాడు. ఏడుస్తూ ఉంటే అనుమానం వస్తుందని అంటాడు. ఆపరేషన్ గురించి శౌర్యకు తెలియదని, ఇలా ఏడిస్తే తనకు అనుమానం వస్తుందని అంటాడు.

శౌర్య ముందు ఏడ్వనని మాట ఇవ్వాలని దీపను కార్తీక్ అడుగుతాడు. అది నా వల్ల అవుతుందా అని దీప అంటుంది. శౌర్యను చూసి ఏడ్చావంటే నా మీద ఒట్టే అని తలపై చేయి పెట్టుకుంటాడు కార్తీక్. ఇప్పటికే ప్రాణం లేని శవంలా నటిస్తున్నాను, ఇంకా మీ మాటలతో నిల్చున్న చోట సమాధి కట్టకండి అని ఏడుస్తుంది దీప. మాటిస్తేనే శౌర్య దగ్గరికి తీసుకెళతానని కార్తీక్ అంటాడు. ...