Hyderabad, ఏప్రిల్ 25 -- Karthika deepam 2 serial april 25th episode: దీప కోసం ఎవడో వచ్చాడంట కదా అంటూ పారిజాతం దీర్ఘాలు తీస్తుంది. తన మాటలకు సుమిత్ర, శివనారాయణ అడ్డుకట్ట వేస్తారు. అప్పుడే శౌర్యని ఎత్తుకుని దశరథ కిందకు దిగుతాడు. తాతయ్య నాకు చాలా చాక్లెట్స్ ఇచ్చారని సంతోషంగా చెప్తుంది.

ఇన్ని ఎందుకు ఇచ్చారని అంటుంది. నా కూతురికి పెళ్లై, పిల్లలు పుడితే మనవరాలితో ఆడుకుండామని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు కూతురిని, మనవరాలిని ఒకేసారి ఇచ్చాడు. తండ్రికి కూతురు మీద చనువు ఉంటుంది ఆ చనువుతోనే చెప్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండాలి అంటాడు.

అయిన వాళ్ళకి బరువైయ్యాను కానీ వాళ్ళకు బాధ్యత అయ్యానని దీప మనసులో అనుకుంటుంది. సుమిత్ర నాకు మొత్తం చెప్పింది. చంటి దాన్ని ఇక్కడే స్కూల్ చేర్పిస్తానని చెప్తాడు. ఇక్కడ స్కూల్ అంటే లక్షల్లో ఖర్చు ఉంటుంద...