Hyderabad, ఏప్రిల్ 11 -- Karthik Varma Dandu On Bommarillu Bhaskar In Jack Event: భమ్ బోలేనాథ్ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కార్తీక్ వర్మ దండు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రీసెంట్‌గా ఆయన సిద్ధు జొన్నల గడ్డ నటించిన జాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిల్లో ఒకరిగా హాజరయ్యారు.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన జాక్ మూవీ నిన్న (ఏప్రిల్ 10) థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం మిశ్రమ స్పందన తెచ్చుకుంటోన్న జాక్ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విరూపాక్ష్ డైరెక్టర్ కార్తీక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కార్తిక్ దండు మాట్లాడుతూ.. "ప్రసాద్ గారు, బాపీ గారు నన్ను 20...