Hyderabad, మార్చి 29 -- Brahmaji Karmanye Vadhikaraste Teaser Released: టాలీవుడ్‌లో నటుడిగా ఎనలేను గుర్తింపు తెచ్చుకుంటున్నారు బ్రహ్మాజీ. ఇటీవలే బాపు సినిమాలో ప్రధాన పాత్ర పోషించి అందరిని మెప్పించారు. ఇప్పుడు బ్రహ్మాజీ నటించిన సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కర్మణ్యే వాధికారస్తే.

వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే "కర్మణ్యే వాధికారస్తే". ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను బయటపెట్టడమే కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈ మూవీ కథాంశం.

కర్మణ్యే వాధికారస్తే సినిమాకు అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే తన దర్శకత్వ శైలితో ఆకట్టుకున్నారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డీఎస్ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె వ...