భారతదేశం, మార్చి 7 -- Karimnagar Suicides: కరీంనగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్(24), అదే మండలం భూపాలపట్నానికి చెందిన నాంపల్లి అలేఖ్య(21) కు మద్య రెండేళ్ళ క్రితం పరిచయం ఏర్పడింది.

కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేసే అరుణ్ కుమార్ డిగ్రీ చదువుతున్న అలేఖ్య ప్రేమించుకున్నారు.

ఇద్దరు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు భయపడ్డారు. ఇంతలో అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం కోసం సంబంధాలు చూస్తున్నారు. తమ ప్రేమ వివాహం జరగదని భావించిన ఇరువురు కరీంనగర్ లోని వావిలాలపల్లిలో స్నేహితుడి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకున్న ఇద్దరు పెద్దలకు చెప్పేంత ధైర్యం చేయలేక బ...