భారతదేశం, ఫిబ్రవరి 27 -- Karimnagar Shivaratri: మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవోపేతంగా జరిగాయి.‌ శైవక్షేత్రాలన్ని భక్తులు కిటకిటలాడాయి. శివన్నామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు రాత్రంతా జాగరణ చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం జన సందోహంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి బారులు తీరి రాత్రంతా జాగరణ తో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

దర్శనానికి ఐదు నుంచి 6 గంటల సమయం పట్టింది. రాజన్న ఆలయం తోపాటు కరీంనగర్ లోని పాత బజార్ లో గల శివాలయానికి, కోటిలింగాల లోని కోటేశ్వర స్వామి ఆలయానికి, పెంబట్ల దుబ్బ రాజన్న, పొట్లపల్లి స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి ...