భారతదేశం, మార్చి 20 -- Karimnagar Politics: మానకొండూర్ నియోజకవర్గంలో అధికార విపక్ష పార్టీలు కాంగ్రెస్- బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతికి పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించడంతో, ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆరు మండలాల నుంచి బెజ్జంకి కి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని రసమయి రావాలని డిమాండ్ చేశారు.‌

కాంగ్రెస్‌- బీఆర్‌ఎస్‌ హంగామాతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. కొందరు రసమయి ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు ...