భారతదేశం, మార్చి 9 -- Karimnagar News : అమ్మా నాన్న లేని అనాథకు అధికారులు అండగా నిలిచారు. అయిన వారు కానరాని పరిస్థితిలో అన్నీ తామై పెళ్లి చేశారు. అనాథ అమ్మాయికి వైభవంగా కరీంనగర్ లో వివాహం జరిపించి ఓ ఇంటి వారిని చేశారు. ఎవరు లేరని బాధపడొద్దు మేమున్నామని చాటిచెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు.

మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించే బాలసదనంలో పెరిగిన అనాథ అమ్మాయి మౌనిక అలియాస్ పూజ వివాహం వైభవంగా జరిగింది. చిన్నప్పుడే అమ్మా నాన్న కన్నాల యశోద మల్లయ్య కాలం చేయడంతో మౌనికతోపాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లను స్థానికులు బాలసదనంలో చేర్పించారు. చదువుకుంటూ పెరిగి పెద్దైన మౌనికకు పెళ్లీడు రావడంతో మంథనికి చెందిన బండారి కళావతి-వెంకన్న దంపతుల ఏకైక కుమారుడు సాయితేజ అనాథ అమ్మాయి మౌనికను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు.

పెళ్లి పెద్దలు...