భారతదేశం, మార్చి 22 -- Karimnagar News : నాలుగైదురోజులుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుంది. గాలి వాన, వడగళ్లు రైతన్నకు అపార నష్టం మిగిల్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురియడంతో చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కరీంనగర్, పెద్దపల్లి డివిజన్ లలో గాలి వానతోపాటు పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. గాలివానకు వెలాది ఎకరాల్లో వరి మొక్కజొన్న పంటలు నేలవాలాయి. పలు చోట్ల వడ్లు రాలాయి. మామిడి కాయలు రాలిపోయాయి. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో ఉన్న పంట దెబ్బతినడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఎకరాన 40 వేల వరకు పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితులో ప్రభుత్వాన్ని ఆద...