భారతదేశం, ఏప్రిల్ 3 -- Karimnagar Master Plan: కరీంనగర్‌ పట్టణంతో పాటు పరిసరాల్లో ఉన్న 62 గ్రామాల పరిధిలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) రూపొందించిన మాస్టర్ ప్లాన్-2041ను అధికారులు సిద్ధం చేశారు.

అమృత్ స్కీమ్ గైడ్లైన్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ ఆండ్ ఇంప్లిమెంటేషన్(యూడీపీఎఫ్) మార్గదర్శ కాలను అనుసరించి ఈ మాస్టర్ ప్లాన్ ను అభివృద్ధి చేశారు. ఇందుకు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా మొదలుపెట్టారు. మాస్టర్ పై ఏమైనా అభ్యంతరాలుంటే 90 రోజుల్లో తెలియజేయవచ్చని ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో సుడా చైర్మ న్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. దీనిపై స్థానికంగా పలువురు తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

ప్రస్తుతం అమలులో ఉన్న సుడా మాస్టర్ ప్లాన్-2019ను అప...