భారతదేశం, ఫిబ్రవరి 6 -- Karimnagar Kidnap: కరీంనగర్ పద్మనగర్ లో నివాసం ఉండే మైనర్ బాలికను ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు యువకులు కలిసి కిడ్నాప్ చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి కారులో అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశారు. బాలిక పేరెంట్స్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నలుగురిని గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో A1 కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కర్ణ కంటి @ కర్ణ నరేష్(32), A2 మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన బాణాల శ్రావణ్(31) A3 నల్లగొండ జిల్లా కాసం గోడే గ్రామానికి చెందినకర్ని @ గౌరారపు కళ్యాణి(29), A4 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, మోదుగులగూడెంకు చెందిన కర్నే సుమలత(28) ఉన్నారు....