తెలంగాణ,కరీంనగర్, జనవరి 31 -- 'ప్రేమించుకున్నారు... పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. ప్రేమ పెళ్ళికి గుర్తుగా ఓ బాబుకు జన్మనిచ్చారు. సజావుగా సాగిన కాపురంలో ఏమైందో ఏమో? ఆమె భర్తకు దూరంగా జీవనం సాగింది. బాబుతో శనివారం మంచిర్యాల నుంచి కారులో బయలుదేరిన ఆ మహిళ కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి వద్ద దారుణ హత్యకు గురైంది. ఆమె వెంట ఉన్న నాలుగేళ్ల కొడుకు అదృశ్యం అయ్యాడు. ఆచూకీ లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మహిళను హత్య చేసింది ఎవరు?... నాలుగేళ్ళ బాబు ఏమయ్యాడనేది...ఇప్పుడు మిస్టరీగా మారింది.

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నర్సింగ్ స్టూడెంట్ మమత. మంచిర్యాల జిల్లా కాసింపేట చెందిన అంబులెన్స్ డ్రైవర్ భరత్ లు ప్రేమించుకున్నారు. ఆరేళ్ళుగా ప్రేమాయణం సాగించి పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ధ్రువ అనే బాబు ...