భారతదేశం, ఫిబ్రవరి 7 -- Karimnagar Crime: మంచిర్యాల జిల్లాకు చెందిన వివాహిత మమత హత్య థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. జనవరి 25న 4 ఏళ్ళ కొడుకుతో కలిసి ఇంటినుంచి బయటకు వెళ్ళిన మమత దారుణ హత్యకు గురైంది. అమె వెంట ఉన్న బాలుడు అదృశ్యమై వారం రోజులకు చైన్నైలో దొరికాడు. బాలుడిని పోలీసులు చేరదీసి కరీంనగర్ కు తరలించి నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు చాకచక్యంగా తప్పించుకుని పారిపోవడంతో పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టి ఐదుగురిని పట్టుకున్నారు.

మమతది మామూలు హత్య కాదు, సుపారీ హత్యగా తేల్చారు. హత్యకు పాల్పడ్డ లక్సెట్టి పేటకు చెందిన వేల్పుల కళ్యాణ్‌తో పాటు సుపారీ హత్య ఒప్పందం చేసుకున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కు చెందిన కులుమల్ల నర్మదా, ఆమె తండ్రి రాజలింగు, కొత్తపేట కు చెందిన బావ బండ వెంకటేష్, కాబోయే భర్త మిట్టపల్లికి చె...