భారతదేశం, ఏప్రిల్ 3 -- Karimnagar Crime: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన గండి రాజశేఖర్ గీతాంజలి దంపతులకు గత నెల మార్చి 18న కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగ బిడ్డ జన్మించింది. అయితే పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు.

కరీంనగర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా చిన్నారి పరిస్థితి విషమించడంతో 24న హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తరలించిన గంటల వ్యవధిలో పసిబాలుడు మృతి చెందాడు. పసికందు మృతదేహాన్ని వెంటనే కుటుంబసభ్యులు స్వగ్రామానికి తరలించి ఖననం చేశారు.

పసికందు పేరెంట్స్ మాత్రం డాక్టర్ ల నిర్లక్ష్యం వల్లే పసిబాలుడు మృతి చెందాడని ఆవేధన వ్యక్తం చేస్తు కరీంనగర్ లోని రెండు ప్రైవేటు ఆసుపత్రులపై పోలీసులకు పిర్యాదు చేశారు. బాబు పుట్టిన తర్వాత ...