భారతదేశం, ఫిబ్రవరి 18 -- Karimnagar Crime: తప్పుడు పత్రాలతో కన్న తల్లిని, సోదరిని మోసం చేసిన ఘనుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.తప్పుడు ఫ్యామిలీ ధృవ పత్రం, తండ్రి డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తి కాజేసిన కొడుకును అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. కొడుకుతో పాటు ఇద్దరిని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

కరీంనగర్ వన్ టౌన్ సిఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారం నిర్వహించిన జోరేపల్లి సుబ్బారెడ్డి 2014 లో మృతి చెందారు. ఆయనకు భార్య క్రిష్ణకుమారి, కొడుకు జోరేపల్లి ప్రదీప్ రెడ్డి (51), కూతురు సుచరిత (53) ఉన్నారు.

భర్త మృతి తర్వాత కృష్ణకుమారి హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ ఫార్చ్యూన్ మెజెస్టిక్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. తన భర్త సుబ్బారెడ్డి కరీంనగర్ లో గ్...