భారతదేశం, ఫిబ్రవరి 26 -- Karimnagar Crime: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రతాపవాడలో కత్తులతో దాడి చేసి భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం రాత్రి రాఘవరెడ్డి ఇంట్లో చొరబడ్డ దొంగలు.. కత్తులతో దాడి చేసి రాఘవరెడ్డి ఆయన భార్య వినోద, కూతురు మానస లను గాయపరిచి 70 తులాల బంగారం ఐదు లక్షల నగదు ఎత్తుకెళ్ళారు. భారీ చోరీ తో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిందితులు కొడుకు నాగరాజు కోడలు తో పాటు ఆరుగురు చోరీ కి పాల్పడినట్లు తేలింది.

కరీంనగర్‌లో జరిగిన దోపిడీ కేసులో కొడుకు కోడలు తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న సొత్తును మీడియా ముందు చూపించి వివరాలు వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు.

రాఘవరెడ్డి కొడుకు నాగరాజు కోటి 80 లక్షల అప్పుల చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. డబ్బులు అడిగితే తండ్రీ ఇవ్వ...