భారతదేశం, మార్చి 27 -- Karimnagar Crime: కరీంనగర్‌లో వరుస చోరీలు ప్రజల్ని హడలెత్తించాయి. బంగారు దుకాణంలో చోరీకి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళను నుంచి పోలీసులు 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 28వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 24 గంటల వ్యవధిలో 14 చోట్ల చోరీలు జరిగాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ లో తాళం వేసిన 8 ఇళ్ళలో, మానకొండూర్ మండలం అన్నారంలో నాలుగు ఇళ్ళలో తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని మిర్చి యార్డులో చోరీ లు జరిగాయి. నగలు నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. తిమ్మాపూర్ లో చోరీ విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇద్దరు దొంగలు చొరబడి 80 వేల నగదు ఎత్తుకెళ్ళడంతో సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

పెద్దపల్లిలోని పైడబజార్‌లో బంగారు షాప్ లో మహిళ చోరీకి పా...