భారతదేశం, ఏప్రిల్ 13 -- Karimnagar Collector : కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆటో నడిపారు. కలెక్టర్ ఆటో నడిపితే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జెండా చూపి మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. కలెక్టర్ ఆటో నడిపితే ఆ ఆటోలో ఎమ్మెల్యే ప్యాసింజర్ గా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.‌ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోవో సొసైటీ సహకారంతో 20 మంది మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణను కలెక్టర్ పమెలా సత్పతి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. కలెక్టర్ ఆటో నడిపి శిక్షణను ప్రారంభించి డ్రైవింగ్ అంటే తనకు భయమని తెలిపారు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కింద పడడ...