భారతదేశం, జనవరి 3 -- Karimnagar Collector: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి రూటే సపరేట్ అన్నట్లుగా ఉంది. వినూత్న ప్రోగ్రాములు చేపట్టి ప్రజలతో మేకం ఆవుతున్నారు. ఇప్పటికే ప్రతి శుక్రవారం మహిళలు పిల్లలతో శుక్రవారం సభ నిర్వహిస్తూ ఆరోగ్య సూత్రాలు అవగాహన కల్పిస్తున్నారు.‌ పిల్లలు తల్లుల ఆరోగ్యం సంక్షేమంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.‌ రొటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. ఆరవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధించారు. పిల్లలతో మమేకమై వారిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిలబస్ గురించిన ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు.

8వ తరగతి విద్యార్థులను సైన్స్ గురించిన ప్రశ్నలను అడిగారు. వి...