తెలంగాణ,కరీంనగర్, మార్చి 28 -- ఆరుకాలం శ్రమించే అన్నదాతలను గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అష్టకష్టాలు పాలు చేస్తుందని ఆరోపిస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్య నాయకులు కరీంనగర్ కలెక్టరేట్ ముందు శుక్రవారం రెండు గంటల పాటు సత్యాగ్రహం దీక్ష చేశారు. దీక్షలో బిజేపి కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బిజేపి కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, గోపి పాల్గొని ప్రభుత్వ తీరు కాంగ్రెస్ నేతల వైఖరి పై మండిపడ్డారు.

సమగ్ర పంటల బీమా పథకం అమలు, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ సత్వరమే నెరవేర్చాలని డిమాండ...