భారతదేశం, ఏప్రిల్ 16 -- Karimnagar Accident: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని అహల్యానగర్ వద్ద రన్నింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ కాలిపోయింది. ముగ్గురు యువకులు బైక్ పై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పొగ రావడంతో బైక్ ను ఆపేశారు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ బైక్ కావడంతో పేలుతుందని భయపడి ముగ్గురు యువకులు బైక్ ను వదిలేసి పారిపోయారు.

హుజురాబాద్‌ అహల్య నగర్‌ రోడ్డుపై చూస్తుండగానే మంటల్లో బైక్ కాలిపోయింది. భయాందోళనకు గురైన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా బైక్ కాలిబూడిదయ్యింది. బైక్ లో మంటలు వస్తున్న విషయం గమనించిన ముగ్గురు యువకులు బైక్ ను వదిలిపెట్టి పారిపోయారని స్థానికులు తెలిపారు. ఆ ముగ్గురు ఎవరు ఎక్కడి వారనేది తెలియాల్సి ఉంది.

రన్నింగ్ లో ఉన్న ఈ బైక్ దగ్దం కావడంతో పలు రకా...