భారతదేశం, ఫిబ్రవరి 13 -- కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఓ వ్యక్తి బెదిరించాడు. గతేడాది సెప్టెంబర్ 28న +447886696497 నుండి వాట్సాప్ కాల్ చేశాడు. 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే.. రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యేలా చేస్తానని బెదిరించాడు. భయాందోళనకు గురైన ఎమ్మెల్యే సత్యం.. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సత్యం ఫిర్యాదుతో.. 339/2024, భారతీయ న్యాయ సంహిత 308, 351(3), (4) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఎమ్మెల్యేను బెదిరించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లోని భవానినగర్‌కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) అని గుర్తించారు. అతడు లండన్ నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడని తేలి...