తెలంగాణ,కరీంనగర్, మార్చి 30 -- కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఏ.పురుషోత్తం పాపం పండింది. అడ్తి వ్యాపారాలను లంచం కోసం వేధించడంతో విసిగిపోయిన వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించారు. ఫ్రూట్ హోల్ సెల్ వ్యాపారుల నుంచి 60 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నేరుగా లంచం డబ్బులు కార్యదర్శి పురుషోత్తం తీసుకోకుండా ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ కార్డ్ శ్రీనివాసరెడ్డి ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. లంచం డబ్బులను సీజ్ చేశారు.

వ్యవసాయం మార్కెట్ యార్డులో పండ్ల వ్యాపారులు అడ్తి వ్యాపారం చేస్తారు. అడ్తి వ్యాపారం కోసం మూడేళ్ళకోసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. లైసెన్స్ గడువు ముగియడంతో మామిడి పళ్ళ సీజన్ ఆరంభం అవుతుండడంతో లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని వ్యాపారుల...