భారతదేశం, జనవరి 15 -- అప్పులు తీర్చుకోవడానికి ఆ దంపతులు అడ్డదారి తొక్కారు. ఏకంగా సామాజిక మాధ్యమాల వేదికగా 'హనీ ట్రాప్' (వలపు వల) పేరుతో. చాలా మందిని బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టారు. భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేశారు. వీరి వలలో చిక్కిపోయిన పలువురు బయటికి రాలేకపోయారు. అయితే ఎట్టకేలకు ఓ వ్యాపారి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లు సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం ఆరేపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆకర్షించేలా వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తారు. వాటిని చూసి కొంతమంది వ్యక్తులు చూసి ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఇదే అదునుగా కొందరు ఆమె నెంబర్ తీసుకొని సంప్రదించారు. ఇదే అదనుగా భావించిన దంపతులు. సదరు వ్యక్తు...