భారతదేశం, మార్చి 19 -- Karimangar News: కరీంనగర్‌లో పెళ్ళాం ఎడబాటును తట్టుకోలేక ముగ్గురు మూడు రకాల నిరసనలతో పోలీసులకు చుక్కలు చూపారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భార్య భాదితుల ఆందోళనలు నవ్వుల పాలవుతున్నాయి.

కరీంనగర్‌లో వారం రోజుల్లో ముగ్గురు మద్యం మత్తులో వినూత్న నిరసనలకు దిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈనెల 11న పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం ఎన్టీపీసీ లో కూలీ పని చేసే బీహార్ కు చెందిన అజయ్ హల్ చల్ చేశాడు. భార్య ప్రీతితో గొడవ పడడంతో స్థానికంగా ఉండే బంధువుల వద్దకు ఆమె వెళ్ళిపోయింది.

భార్య ఎడబాటును తట్టుకోలేని అజయ్ మద్యం సేవించి మత్తులో మేడిపల్లి సెంటర్ లోని విద్యుత్ హై టెన్షన్ టవర్ ఎక్కాడు. విద్యుత్ వైర్ల వరకు వెళ్ళి భార్య కావాలని డిమాండ్ చేశాడు. ప్రమాదక పరిస్థితిలో కరెంట్ హై టెన్షన్ వైర్ల వద్దకు వెళ్ళి కాపురానికి దూరమైన భార్యను రప్పి...